Friday, May 3, 2024

కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ – గోవా అధ్య‌క్షుడు ‘గిరీష్ చోడంక‌ర్’ రాజీనామా

కాంగ్రెస్ కి క‌ష్టాలు త‌ప్పేలా లేవు. గోవా కాంగ్రెస్ అధ్య‌క్షుడు గిరీష్ చోడంక‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి అధిష్టానానికి షాక్ ఇచ్చారు.చోడంకర్ తన రాజీనామాను ఏఐసీసీకి పంపినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గోవా డెస్క్ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు మీడియాకు వెల్ల‌డించారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చోడంకర్ కాంగ్రెస్‌కు సారథ్యం వహించారు. కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకోగలిగింది. దాని మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ 20 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత గురువారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, చోడంకర్ తన పార్టీ పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ వైదొలగాలనే నిర్ణ‌యాన్ని ప్రతిపాదించారు.చోడంకర్ రాజీనామా ఆమోదం పొందుతుందని, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి పార్టీ ప‌గ్గాలు చేప‌డుతార‌ని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. “సంకల్ప్ అమోంకర్, అలీక్సో సిక్వేరా మరియు ఎల్విస్ గోమ్స్ వంటి నాయకులు గోవా కాంగ్రెస్ చీఫ్ రేసులో ముందంజలో ఉన్నారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమోంకర్ .సిక్వేరా .గెలుపొందగా, మాజీ బ్యూరోక్రాట్ అయిన గోమ్స్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement