Monday, April 29, 2024

రాజ‌ప‌క్స సోద‌రుల‌కు షాక్.. దేశం విడిచి వెళ్లొద్దు… సుప్రీంకోర్టు

శ్రీలంక సుప్రీంకోర్టు ఆ దేశ మాజీ ప్రధాని మహిందా రాజపక్సకు షాకిచ్చింది. దేశం విడిచిపోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ ఆర్థికమంత్రి బాసిల్ రాజపక్స కూడా జులై 28 వరకు దేశం బయటకు అడుగుపెట్టొద్దని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పాలనపై ఆగ్రహంతో ఉన్న జనం నిరసనతో హోరెత్తించారు. దీంతో ఆయన మాల్దీవులకు పారిపోయారు.

ఈ క్రమంలో మాజీ ప్రధాని మహిందా రాజపక్స, గొటబాయ సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స దేశం నుంచి పారిపోయే అవకాశం ఉండటంతో వారిని నిలువరించేలా ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శ్రీలంక వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement