Wednesday, May 1, 2024

గుజరాత్ టైటాన్స్ కు షాక్.. ఐపీఎల్ కు కేన్ విలియమ్సన్ దూరం..

గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్ లో సీఎస్కే ఇన్సింగ్స్ 13వ ఓర్లో జోషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెననర్ రుతురాజ్ గైక్వాడ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఈక్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాల్లోకి ఎగిరి దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను బ్యాలెన్స్ తప్పానని గ్రహించిన కేన్ మామా బంతిని మైదానంలోకి విసిరేసి తన జట్టుకు రెండు పరుగులను సేవ్ చేశాడు.

అయితే బంతిని అపే క్రమంలో మోకాలు నేలను బలంగా ఢీ కొట్టింది. దీంతో నొప్పితో అతడు బాధపడుతూ గ్రౌండ్ ను వీడాడు. ఫిజియో చికిత్స అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. దీంతో సహాచర ఆటగాళ్ల సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ చేసిన వాఖ్యల ప్రకారం.. కేన్ విలియ‌మ్స‌న్ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నట్లు స్పష్టంగా అర్థమ‌వుతోంది. విలియమ్సన్ కు మోకాలికి తీవ్ర గాయమైంది.. అతడిని మా ఫిజియోలు పరిశీలిస్తున్నారు.. కేన్ ను స్కానింగ్ కు కూడా పంపించారు అంటూ తెలిపాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement