Friday, April 26, 2024

Motivational Story: ‘వాటర్ మ్యాన్’.. 26 ఏళ్లుగా ఏం చేస్తున్నారంటే..

ఎండాకాలం వచ్చిందంటే చాలా ప్రధానంగా నీటిసమస్య వేధిస్తుంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు పడరాని కష్టాలు పడుతుంటారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడితో అల్లాడుతారు. అయితే, ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొన్ని సేవా సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 26 ఏళ్లుగా ఉచితంగా నీటిని పంపిణీ చేస్తున్నాడు. 

మధ్యప్రదేశ్ కు చెందిన శంకర్ లాల్ సోనీని జబల్ పూర్ లో ‘వాటర్ మ్యాన్’ గా పిలుస్తుంటారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో ఆయన తనవంతు సాయం చేస్తున్నాడు. సైకిల్ పై వాటర్ బాటిళ్లు, వాటర్ స్టోరేజీ ప్యాకెట్లు తీసుకెళ్లి అందరి దాహం తీరుస్తున్నాడు. అందుకే జబల్ పూర్ వాసులు ఆయనను ముద్దుగా ‘వాటర్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. దాహం తీర్చిన శంకర్ లాల్ ఎవ్వరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా నిస్వార్థంతో ప్రజలకు సేవ చేస్తున్నాడు.  వేసవిలో ప్రజలకు చల్లటి నీటిని అందిస్తూ దాహార్తిని తీరుస్తున్నాడు. సైకిల్ కు రెండు వైపులా 18 వాటర్ బాటిళ్లు, 18 వాటర్ బ్యాగులు తగిలించుకుని ప్రజల దాహాన్ని తీరుస్తున్నాడు. దాదాపు 26 ఏళ్లుగా ఇదేవిధంగా చేస్తున్నాడు. శంకర్ లాల్ సేవలపై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement