Monday, April 29, 2024

Delhi: కేసీఆర్ చిత్రపటానికి శేజల్ పాలాభిషేకం.. న్యాయం చేయాలంటూ వినతి

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ చిత్రటానికి ఆరిజన్ డెయిరీ సీఈఓ శేజల్ పాలాభిషేకం చేశారు. మహిళా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బారినుండి తనకు న్యాయం కావాలని పోరాడుతుంటే మాత్రం స్పందించడం లేదని ఆరిజన్ డెయిరీ సీఈఓ శేజల్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేపై తాజాగా సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ మహిళా సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. నిరసన తెలపడంలో భాగంగా పాలాభిషేకం చేశానని.. అయితే ఈ పాలాభిషేకంతో న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదన్నారు.

ఎమ్మెల్యే చిన్నయ్య తనను నేరుగా వేధించాడని, తెలంగాణాలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదనే తాను సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. బెల్లంపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని, ఎవరూ కేసులు పెట్టకపోయినా మమ్మల్ని అదుపులోకి తీసుకొని ఎమ్మెల్యే చెప్పినట్లు చేయాలంటూ సీఐ బాబురావు, ఎస్సై రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు బెదిరించారని ఆరోపించారు. కోర్టుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్న తమను పోలీస్ స్టేషన్ లోనే బంధించారని శేజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement