Thursday, April 25, 2024

కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ రవి గుప్తా?.. ప‌రిశీల‌న‌లో మ‌రో ముగ్గురి పేర్లు!

తెలంగాణ డీజీపీ ఎం. మ‌హేంద‌ర్‌రెడ్డి ప‌ద‌వీ కాలం పూర్తి కానుంది. వ‌చ్చే నెల 31తో ఆయ‌న రిటైర్ కాబోతున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవి గుప్తాతోపాటు మ‌రో ఇద్ద‌రు అధికారుల పేర్లు పరిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏసీబీ డీజీగా ప‌నిచేస్తున్న అంజ‌నీకుమార్‌తోపాటు.. త్వ‌ర‌లోనే రిటైర్ కాబోతున్న డీజీ స్థాయి అధికారి గోవింద్ సింగ్ పేర్లు కూడా డీజీపీ రేసులో వినిపిస్తున్నాయి.

ఇక‌.. గోవింద్ సింగ్ స్థానంలో డీజీగా హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న‌ సీవీ ఆనంద్ పదోన్నతి పొందనున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. కొత్త డీజీపీ నియామకం కోసం కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం. ఐదుగురు అధికారుల ప్యానల్ తో యూపీఎస్సీకి జాబితా పంప‌నున్నట్టు తెలుస్తోంది. ఇక‌.. ఆ అయిదు పేర్ల‌లో నుంచి ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ సిఫారసు చేయనుంది. అయితే.. రాష్ట్ర డీజీపీ నియామ‌కంపై ముఖ్య‌మంత్రిదే తుది నిర్ణ‌యం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement