Tuesday, April 23, 2024

సూర్య‌42వ ప్రాజెక్ట్.. క్యూరియాసిటీ పెంచుతోన్న లుక్

పీరియాడిక్ స్టోరీ నేప‌థ్యంలో రానుంది త‌మిళ స్టార్ హీరో సూర్య కొత్త మూవీ. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై తాజా అప్‌ డేట్ ఒకటి బయటకు వచ్చింది. కొత్త షెడ్యూల్‌ ఇవాళ చెన్నైలో మొదలైంది.

సూర్యతోపాటు ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను తాజా షెడ్యూల్‌లో షూట్ చేయబోతుంది డైరెక్టర్ శివ టీం. సూర్య 42 ప్రాజెక్ట్‌ 2డీ, 3డీ ఫార్మాట్‌లలో కూడా 10 భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సూర్యకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సూర్య 42 నుంచి విడుదలైన లుక్‌ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement