Monday, May 6, 2024

Breaking: తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి తాత్కాలిక బ్రేక్

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా కేసులు తగ్గకపోయినా పాఠశాలలను రీ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభంపై వారం పాటు స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

హైకోర్టు స్టే విధించడంతో సెప్టెంబర్ 7 వరకు తెలంగాణలో విద్యా సంస్థలు రీ ఓపెన్ అయ్యే అవకాశాలు లేవు. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్లలను బలవంతం చేయవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రెసిడెన్షియల్ హాస్టళ్లు కూడా తెరవొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేరెంట్స్, మేనేజ్‌మెంట్లపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరింది. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీలు తీసుకోవద్దని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement