Sunday, October 6, 2024

శామ్‌సంగ్ కీలక నిర్ణయం.. రష్యాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు నిలిపివేత

ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై ప్రపంచ దేశాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాయి. టెక్ సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా రష్యాకు తమ సేవలు నిరాకరిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కూడా అదే బాటలో నడుస్తోంది. 

రష్యాకు స్మార్ట్ ఫోన్లు, చిప్ లతో పాటు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సరఫరా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఉక్రెయిన్ లో రష్యా సైనిక బలగాల దాడులను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్నామని, రష్యా దాడులతో ప్రభావితమవుతున్న ప్రతి ఒక్కరి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విపత్కర సమయంలో తమ సిబ్బంది,వారి కుటుంబాల క్షేమం తమ ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేసింది. శామ్‌సంగ్ రష్యాలో స్మార్ట్‌ఫోన్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్నది. ఉక్రేనియన్ ప్రజలకు మద్దతునిస్తూ రష్యాలో తమ అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement