Tuesday, April 16, 2024

ప్రాణ భ‌యంతో-బుల్లెట్ ఫ్రూఫ్ కారు కొన్న స‌ల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. ఇటీవల పంజాబీ సింగర్‌ సిద్దూ మూసేవాలాని మర్డర్‌ చేసిన విషయం తెలిసిందే. సింగర్‌ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు లారెన్స్ అతిపెద్ద క్రైం సిండికేట్‌ని నడిపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు సల్మాన్ ని బెదిరించారని తెలుస్తుంది.దాంతో ఇటీవలే లైసెన్స్ గన్‌ తీసుకున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు కొన్నాడు. తాజాగా ఆయన కొత్త కారు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

అనేక లగ్జరీ కార్లు కలిగిన సల్మాన్‌.. ఉన్నట్టుండి సడెన్‌ గా బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు కొనడానికి కారణం ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. పెద్ద రచ్చ లేపుతుంది. సల్మాన్‌ ఖాన్‌ తాజాగా ఎయిర్‌ పోర్ట్ వద్ద తన కొత్త కారుతో కనిపించారు. టయోటా ల్యాండ్‌ క్య్రూయిజ్‌ ఎస్‌యువీ కారు అది. దాని గ్లాసెస్‌ చాలా మందంగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే బుల్లెట్‌ ప్రూఫ్ కారని తెలుస్తుంది. హిందీ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారుతుంది. అయితే దీని విలువ సైతం షాకిస్తుంది. కోటిన్నర రూపాయలతో సల్మాన్‌ ఈ కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement