Sunday, October 13, 2024

అమిత్ షాతో సువేందు అధికారి భేటీ

కోల్‌క‌తాలో టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారుల దాడులు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో కోల్‌క‌తాలోని నాలుగు ప్ర‌దేశాల్లో ఈడీ దాడులు చేప‌ట్టింది. ఈ స్కామ్‌లో అరెస్ట‌యిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధ ఛ‌ట‌ర్జీ స‌న్నిహితురాలు అర్పితా ముఖ‌ర్జీ ఇంటారాగేష‌న్‌లో ల‌భించిన ప‌త్రాల ఆధారంగా ఫోర్ట్ ఒయాసిస్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఫ్లాట్‌పై ఈడీ అధికారులు దాడులు నిర్వ‌హించారు.

ఈ నేప‌ధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అవినీతి కార్య‌క‌లాపాల్లో కూరుకుపోయిన 100 మంది టీఎంసీ నేత‌ల జాబితాను సువేందు అధికారి ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు అంద‌జేసిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement