Wednesday, May 1, 2024

TV & Movie | సాయిధరమ్‌ తేజ్‌ నెక్ట్స్ మూవీ గాంజా శంకర్‌.. ఫస్ట్ లుక్‌ టీజర్ అదుర్స్‌

విరూపాక్షతో సాయిధరమ్‌ తేజ్‌కు మంచి బ్రేక్ వ‌చ్చింది. గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేసిన‌ప్ప‌టికీ విరూపాక్ష పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన బ్రో మూవీ కాస్త నిరాశ పరిచింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదనే టాక్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో తాను ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ తీసుకోబోతున్నట్టు సాయిధరమ్‌ తేజ్ ప్ర‌క‌టించారు. మెంటల్లీ, ఫిజికల్లీ మరింత స్ట్రాంగ్‌ అయ్యాక తాను సినిమాలు చేస్తానని ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు.

అయితే.. లేటెస్గ్‌గా ఆయన ఓ కొత్త సినిమాని ప్రకటించడం విశేషం. సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాకి సాయితేజ్‌ చాలా రోజుల క్రితమే కమిట్‌ అయ్యారు. ఇది ఇప్పటికే పట్టాలెక్కాల్సింది. కానీ సాయితేజ్‌ బ్రేక్‌ ఎఫెక్ట్ ఈ చిత్రంపై పడింది. కాగా, సాయిధరమ్‌ తేజ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి గాంజా శంకర్‌గా టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు.

YouTube video

ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సాయిధరమ్‌ తేజ్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్‌ క్లారిటీ కానీ, లుక్‌ మాత్రం మాస్‌గా ఉంది. ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు ఆయన ఆయుధాలు పట్టుకుని యాక్షన్‌కి దిగినట్టుగా ఈ ఫస్ట్ లుక్‌ ఉంది. ఓ వైపు దుమ్ములేస్తుండగా, సాయితేజ్‌ నోట్లో సిగరేట్‌తో అదరగొడుతున్నారు. ఇక ఇందులో హీరో పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌ అదిరిపోయింది. మాస్‌ని వివరించలేం, జస్ట్ ఫీల్‌ అవ్వాలి ఈ మాసివ్‌ కాంబో అంటూ ఈ టీజర్‌ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement