Wednesday, May 1, 2024

ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వ‌చ్చినా కరోనా వస్తుంది!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చినా క‌రోనా రావొచ్చున‌ని ఆయన అన్నారు. కరోనా వైరస్ కొత్త రకాన్ని ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో కూడా పట్టుకోలేనంత‌గా త‌యారైంద‌ని వ్యాఖ్యానించారు. చాలా మందిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, వారి నివేదిక నెగెటివ్‌ గా ఉంటుందంటే.. క‌రోనా రాన‌ట్టుగా భావించొద్ద‌ని ఆయ‌న సూచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ గా ఉన్నప్పటికీ, కరోనా సాంప్రదాయ లక్షణాలు ఉన్నవారి మాదిరిగానే చికిత్స అందించాల్సిన అవ‌స‌రం ఉందని డాక్ట‌ర్ గులేరియా చెప్పారు.

కరోనా వైరస్ కొత్త రకం అంటువ్యాధి అని తెలిపారు. కరోనా సోకిన రోగి నుంచి ఒక నిమిషంలోనే మరొక వ్యక్తికి సోకుతుందని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున, పరీక్ష నివేదికలు రావ‌డానికి చాలా రోజులు ఆలస్యం అవుతున్నాయని గులేరియా చెప్పారు. వైద్యులు క్లినికో-రేడియోలాజికల్ డయాగ్నసిస్ చేయాలని, సీటీ స్కాన్ చేసి కరోనా సాంప్రదాయ లక్షణాలను కనిపిస్తే.. వారికి చికిత్స ప్రారంభించాల‌ని సూచించారు. వాస‌న పసిగ‌ట్ట‌లేక‌పోవ‌డం, జ్వ‌రం, ఆయాసంగా, బ‌ల‌హీనంగా, అల‌స‌ట‌గా ఉండ‌టం, గొంతులో నొప్పి క‌నిపించ‌డం, క‌డుపులో నొప్పి, గ్యాస్ స‌మ‌స్య వంటి ల‌క్ష‌ణాలు ఏవీ క‌నిపించినా క‌రోనాగా భావించి చికిత్స తీసుకోవాల‌ని డాక్ట‌ర్ గులేరియా చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement