Thursday, April 18, 2024

ఈనెల 30 నుంచి ఓటీటీలో ‘సుల్తాన్’

బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుల్తాన్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. తమిళ్ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది.

అలాగే తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈనెల 30 నుంచి తెలుగు సుల్తాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు కార్తీ. సుల్తాన్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఏప్రిల్ 30న ఈ యాక్షన్ డ్రామా స్ట్రీమ్‌కు సిద్ధమైందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement