Monday, April 29, 2024

‘ఆర్ ఆర్ ఆర్ రిలీజ్’ వాయిదా – స్ప‌ష్టం చేసిన నిర్మాణ సంస్థ‌

ఈ నెల 7న రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ నెల 7న ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. మా చిత్రాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. బేషరతుగా ప్రేమిస్తున్న అభిమానులు, ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చిత్ర యూనిట్ తెలిపింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని మళ్లీ మీ ముందుకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నామ‌ని నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్ టైన్ మెంట్ తెలిపింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఓ ట్వీట్ ని పోస్ట్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement