Friday, April 26, 2024

Row Over States: రాష్ట్రాలపై కేంద్రం మరో వివాదం.. అప్పులు ఎక్కువ చేస్తున్నారని వింత వాదన!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. బీజేపీయేతర రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపడమే కాకుండా.. చేసిన అప్పులను ప్రశ్నిస్తూ.. శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో ముడిపెట్టింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఇవ్వాల (మంగళవారం) జరిగిన అఖిలపక్ష భేటీలో కేవలం బీజేపీయేతర రాష్ట్రాల్లో అప్పుల తీరుపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని పలు పార్టీల నేతలు కేంద్రం తీరును తప్పుపడుతున్నారు.

కాగా, నాలుగు రాష్ట్రాల పాలక పక్షాలతో పాటు కేంద్రంలోని ప్రతిపక్షాలన్నీ — ఈరోజు శ్రీలంకలో సంక్షోభంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నాయి. అయితే.. ఈ భేటీలో దేశ ఆర్థిక స్థితిగతులు, అప్పులు, ఆదాయం వంటి అంశాలపై చర్చించకుండా.. కేవలం బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక అంశాలపై చర్చించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత తమకు ‘రాజకీయ ఉద్దేశం’ లేదని, ‘శ్రీలంక నేర్పిన పాఠాలు చాలా బలంగా ఉన్నాయని’ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు టీఆర్​ఎస్​ లీడర్లు.

మొదట అభ్యంతరం తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి, తమిళనాడు డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.  ఆ తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ‘‘మేము చూపించాలనుకుంటున్న దానిలో ఒక లాజిక్ ఉంది. మేము ఒకటి లేదా రెండు రాష్ట్రాలను తప్పుగా చూపించలేదు. అన్ని రాష్ట్రాల పరిస్థితిని తెలియజేశాం. ఇందులో రాజకీయ ఉద్దేశ్యం లేదు. ఇది ఆర్థిక స్థితిగతులపై ఉన్న డేటా -ఆధారిత ప్రదర్శన మాత్రమే”అన్నారు.

కాగా, శ్రీలంకలో రేపు కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకోనుంది. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మాజీ విద్యాశాఖ మంత్రి డల్లాస్ అలహప్పెరుమ, వామపక్ష నేత అనురా దిసానాయకతో తలపడనున్నారు. ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస మిస్టర్ అలహప్పెరుమకు మద్దతు ప్రకటిస్తూ అధ్యక్ష రేసు నుండి వైదొలిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement