Friday, April 26, 2024

కలెక్టర్ సుప్రీం కంటే సుప్రీమా?: రేవంత్ రెడ్డి

యాసంగిలో వరి విత్తనాలు విక్రయిస్తే ఊరుకునేది లేదంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. సిద్దిపేట్ కలెక్టర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ విత్తన డీలర్లను బెదిరించడం.. రైతులను బ్లాక్​మెయిల్ చేయడమేనని అన్నారు. రైతుల ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి ప్రభుత్వం చేతులెత్తేసే పన్నాగమని ఆయన ధ్వజమెత్తారు. వరి విత్తనాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని.. సుప్రీం కోర్టు ఆర్డర్ తెచ్చినా షాపులు తెరవనిచ్చేది లేదని డీలర్లను కలెక్టర్ బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సుప్రీం కంటే సుప్రీమా? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాగా, యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే షాపుని సీజ్ చేస్తామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని ఆయన తేల్చిచెప్పారు. విత్తనాలు, ఎరువుల డీలర్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: Telangana: టీకా తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్ కట్

Advertisement

తాజా వార్తలు

Advertisement