Sunday, April 14, 2024

శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్రాల బాధ్యత..ప్రధాని మోడీ

హర్యానాలో జరుగుతున్న చింతన్ శివిర్ నేపథ్యంలో పలు రాష్ట్రాల హోం మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోడీ. శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్రాల బాధ్యత అనీ, అయితే లా అండ్ ఆర్డర్ దేశ ఐక్యత, సమగ్రతతో ముడిపడి ఉందని మోడీ అన్నారు. వివిధ సవాళ్ల మధ్య, పండుగల సమయంలో దేశ ఐక్యతను బలోపేతం చేయడం మీ సన్నాహాలను ప్రతిబింబిస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రాల బాధ్యత, అయితే ఇవి దేశ ఐక్యత-సమగ్రతతో ముడిపడి ఉన్నాయిని ప్ర‌ధాని అన్నారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంతులు, హోం మంత్రులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల డైరెక్టర్ జనరల్స్, రాష్ట్రాల హోం కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ చింతన్ శివార్ లో పాలుపంచుకుంటున్నారు. సూరజ్ కుండ్ లోని కొన‌సాగుతున్న వివిధ రాష్ట్రాల హోం మంత్రులకు చెందిన ఈ చింత న్ శివిర్ దేశ సహకార సమాఖ్య విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వివిధ రాష్ట్రాలు ఒకరి నుండి ఒకరు మెరుగైన విష‌యాలు నేర్చుకోవచ్చు.. ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందవచ్చు. దేశ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయవచ్చు.. ఇది రాజ్యాంగం.. మ‌న భావ‌న‌.. మన పౌరుల పట్ల మన కర్తవ్యమని తెలిపారు. పోలీసు బలగాల ఆధునీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఐటీ వినియోగం పెరగడం, భూ సరిహద్దు నిర్వహణ, తీరప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై హోం మంత్రుల చింత‌న్ శివిర్ చర్చించినట్లు ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement