Friday, May 17, 2024

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 3శాతం డీఏ – బ‌కాయిలు విడుద‌ల‌

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోడీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు,పెన్ష‌న‌ర్ల‌కు (డీఆర్) 3 శాతం మేర డీఏ పెంచుతున్న‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా డీఏ బ‌కాయిల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో మోడీ స‌ర్కారు ఈ నిర్ణ‌యాలు తీసుకుంది. ఇక ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గానూ కేంద్రం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబందించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement