Sunday, May 19, 2024

త‌గ్గిన బంగారం,వెండి ధ‌ర‌లు

బంగారం కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త. బంగారం ధ‌ర‌లు నేల చూపులు చూశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఆదివారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 50,570కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 500 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 46,350కు తగ్గింది. బంగారం ధరలు వెలవెలబోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు భారీగా తగ్గింది. రూ.1,000 తగ్గుదలతో రూ. 69,000కు పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఔన్స్‌కు 1.86 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1890 డాలర్లకు క్షీణించింది. బంగారం తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.55 శాతం తగ్గుదలతో 24.30 డాలర్లకు క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement