Monday, April 29, 2024

RBI | ఆర్బీఐ వెబ్​సైట్​ క్రాష్​.. నిజమా, కాదా? తెలుసుకునేందుకు ఎగబడ్డ జనం

రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్​బీఐ ప్రకటించింది. దీంతో ఇవ్వాల సాయంత్రం ఒక్కసారిగా ఆర్​బీఐ అధికారిక వెబ్​సైట్​ క్రాష్​ అయినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో చాలామంది నెటిజన్లు ఈ వార్త నిజమేనా? కాదా? అనేది తెలుసుకునేందుకు ఆర్బీఐ వెబ్‌సైట్‌ను ఓపెన్​ చేశారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ క్రాష్ అయ్యింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రూ.2000 నోట్లు ఇకపై చెలామణిలోకి రావని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం సాయంత్రం ఆకస్మాత్తుగా ప్రకటించింది. అయితే.. రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, కొంతకాలం మనుగడులలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసినా చాలా మంది దీన్ని నమ్మడం లేదు. అదే సమయంలో రూ.2000 నోట్లను బ్యాంకులు ఇవ్వకుండా నిలువరించాలని ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుందని ఆదేశాలివ్వడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు.

కాగా, జనాల దగ్గరున్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు కానీ, ఫెసిలిటీ సెంటర్లు కానీ.. ఆయా బ్యాంకుల్లో ఉంచాలని పేర్కొంది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఈ సెప్టెంబర్ 30 వ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చింది. అయితే ఒకేసారి రూ.20వేలకు మించి డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు మాత్రమే పర్మిషన్​ ఇవ్వడం కూడా మరింత ఆందోళనకు దారితీస్తోందంటున్నారు సామాన్య ప్రజనీకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement