Friday, May 3, 2024

జై భీమ్ కి అరుదైన గౌర‌వం – పండ‌గ చేసుకుంటోన్న చిత్ర టీం

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రం జైభీమ్. ఆస్కార్స్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా నామినేట్ అయింది ఈ చిత్రం. నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో 3 అవార్డులు వచ్చాయి. కాగా డిజిట‌ల్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది జై భీమ్ చిత్రం. కాగా ఈ చిత్రం అరుదైన గౌర‌వాన్ని అందుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అవార్డ్స్‌-2022లో రెండు విభాగాల్లో పుర‌స్కారాలు ద‌క్కించుకుంది. కోర్టు రూం డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన జైభీమ్‌..ఉత్తమ చిత్రం, ఉత్త స‌హాయ న‌టుడు అవార్డులు ద‌క్కాయి. బాధితుడి పాత్ర‌లో జీవించిన మ‌ణికంద‌న్‌కు ఉత్త‌మ స‌హాయ న‌టుడు అవార్డు ద‌క్కింది. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌ని పోషించారు. ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ తెర‌కెక్కించారు. కాగా రావు ర‌మేశ్‌, ర‌జిషా విజ‌య‌న్, ప్ర‌కాశ్ రాజ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement