Thursday, July 25, 2024

రామ్ చ‌ర‌ణ్ కి అరుదైన గౌర‌వం.. గుడ్ మార్నింగ్ అమెరికా షో నుండి పిలుపు

అమెరికా పాపుల‌ర్ టెలివిజ‌న్ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో సంద‌డి చేయ‌నున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.కాగా ఈ టీవీ షోలో సందడి చేయబోతున్న తొలి టాలీవుడ్ నటుడు రాంచరణ్‌ కావడం విశేషం. ఈ షోలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. భారత కాలమానం ప్రకారం ఏబీసీ ఛానల్‌లో ఇవాళ రాత్రి 11:30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ షోలో చరణ్‌ తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చరణ్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023కు వన్‌ ఆఫ్‌ ది ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. అమెరికన్‌ యాక్టర్లు బ్రండోన్‌ పెరెరా, డేవిడ్‌ డస్ట్‌మాల్చియాన్‌, మేడ్‌లిన్‌ క్లైన్‌, ట్రినిటీ జో-లీ బ్లిస్‌, వయోలెట్ ఎంసీగ్రాతో కలిసి పాపులర్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్సులో మెరువబోతున్నాడు రాంచరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023 ఫైనల్‌ నామినేషన్స్‌ లో ఉత్తమ యాక్షన్‌ సినిమా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement