Wednesday, May 8, 2024

రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ఎనౌన్స్

రామారావు ఆన్ డ్యూటీ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్. మార్చి 25వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటన చేసింది చిత్రబృందం. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ మూవీని శ‌ర‌త్ మండ‌వ తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కిది మొద‌టి చిత్రం. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉండగా రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement