Friday, May 3, 2024

ఏఎన్‌యూలో 27 నుంచి వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళా చాంపియన్‌షిప్‌ పోటీలు

ఏఎన్‌యూ క్యాంపస్‌, ప్రభన్యూస్‌: నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి 30 వరకు ఆలిండియా అంతర విశ్వవిద్యాలయాల వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళా ఛాంపియన్‌షిప్‌ (2021-2022) పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని పోటీల నిర్వహణ కార్యదర్శి డాక్టర్‌ పి.జాన్సన్‌ తెలిపారు. మొత్తం పది విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా 125 విశ్వవిద్యాలయాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని, పోటీలకు విచ్చేస్తున్న అథ్లెట్లకు వర్సిటీ క్రీడా వసతిగృహంలో వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఏఎన్‌యూలోని ఇండోర్‌ స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈనెల 26న మేనేజర్ల సమావేశం జరుగుతుందని, ఈనెల 27న ఆడిటోరియంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల ప్రారంభ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందన్నారు.ఈ ఛాంపియన్‌షిప్‌ ఏఎన్‌యూ నాల్గొవసారి నిర్వహిస్తుందని జాన్సన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పోటీల కమిటీ ఛైర్మన్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ ఏర్పాట్లపై సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement