Friday, May 3, 2024

Lok Sabha | ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్ స్ఫూర్తికి రామమందిరం చిహ్నం: స్పీకర్‌ ఓం బిర్లా

17వ లోక్‌సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించారు. భావితరాలకు ఆశ, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. చారిత్రాత్మకమైన రామమందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై నాలుగు గంటల పాటు సభలో చర్చించారు. చివరగా తీర్మానాన్ని చదువుతూ స్పీకర్ ఓం బిర్లా శతాబ్దాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలో రామ మందిరం నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయం ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్ స్ఫూర్తికి ప్రతీక అన్నారు.

రామజన్మభూమి వివాదంలో కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు సైతం ప్రస్తావించారు. తీర్మానం ద్వారా అయోధ్యలో జరిగిన చారిత్రక కృషిని సభ్యులు అభినందిస్తున్నారన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయం రాళ్లతో కట్టినది కాదని.. విశ్వాసాలతో కూడుకున్నదన్నారు. జనవరి 22న శంకుస్థాపనకు ముందు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయన అనేక మతపరమైన ప్రదేశాలను సందర్శించి జాతీయ ఐక్యత సందేశాన్ని ఇచ్చారన్నారు. ఇందులో న్యాయవ్యవస్థ, సమాజం కీలక పాత్ర పోషించాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement