Saturday, April 20, 2024

ఇండియ‌న్ ఫిల్మ్స్ కి ఆస్కార్.. ధ‌న్య‌వాదాలు తెలిపిన రాజ్య‌స‌భ‌

ఇండియ‌న్ సినిమాకు ఆస్కార్ అవార్డులు ద‌క్క‌డం మ‌న వైభ‌వాన్ని చాటుతుంద‌ని చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ అన్నారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి ఇది ఒక కొత్త గుర్తింపుని ఇచ్చింద‌న్నారు.ప్ర‌పంచ దేశాల నుంచి మ‌న సినిమాల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇండియ‌న్ చిత్రాల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింద‌న్నారు చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్. కాగా ఆస్కార్స్ గెలిచిన ఆర్ఆర్ఆర్, ద ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ చిత్ర బృందాల‌కు రాజ్య‌స‌భ కంగ్రాట్స్ తెలిపింది.
ఆస్కార్స్ 2023లో ఇండియ‌న్ ఫిల్మ్స్‌కు రెండు అవార్డులు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఫిల్మ్‌లోని నాటు నాటు సాంగ్ , ద ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్లు ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ ధ‌న్య‌వాదాలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement