Sunday, March 26, 2023

Navajivan Express : టీటీఈపై రైల్వే ప్రయాణికుడి దాడి

మహబూబాబాద్‌ : నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ ప్రయాణికుడు హల్‌చల్‌ చేశాడు. టికెట్‌ అడిగిన టీటీఈపైనే దాడికి దిగాడు. మంగళవారం మహబూబాబాద్‌ వద్ద నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ విషయంలో రైల్వే టీటీఈ కిరణ్‌ కుమార్‌తో ప్రయాణికుడు రవితేజ వాగ్వాదానికి దిగాడు. నిబంధనలు అతిక్రమించినందుకు ఫైన్‌ చెల్లించాలని రవితేజను టీటీఈ కోరాడు. దీంతో ఫైన్‌ చెల్లించకపోగా కోపంతో ఊగిపోయిన రవితేజ టీటీఈపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో టీటీఈ కిరణ్‌ కుమార్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నిందితుడు రవితేజను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement