Sunday, April 28, 2024

Something Spl | సోనియాకు కానుకగా పెట్ డాగ్‌.. ప్ర‌జెంట్‌ చేసిన రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవ్వాల (బుధవారం) త‌న త‌ల్లి సోనియా గాంధీకి పెట్ డాగ్‌ని బ‌హూక‌రించారు. ఈ మ‌ధ్య‌నే గోవా నుంచి తెచ్చుకున్న పెంపుడు కుక్క పిల్ల నూరీ ఫొటోను త‌ల్లికి ప్ర‌జెంట్ చేసిన వీడియో, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆగస్టులో గోవా పర్యటనకు వెళ్లిన రాహుల్.. అక్కడ ఇద్దరు దంపతులు నిర్వహిస్తున్న పెట్ డాగ్స్‌ కేంద్రాన్ని సందర్శించారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలు నచ్చడంతో తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో శునకాన్ని కూడా తెప్పించుకున్నారు.

YouTube video

తన వెంట తీసుకెళ్లిన ఆడ కుక్క పిల్లకు నూరీ అని పెట్టారు రాహుల్ గాంధీ. దాన్ని తన ఇంటికి తీసుకెళ్లి తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. కుక్కపిల్ల బాగుందన్న సోనియా దానితో కాసేపు ఆడుకున్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న మరో కుక్కపిల్లతో నూరీ కలిసిపోయి సంద‌డి చేస్తోంది. అయితే.. గోవాలో కుక్కల పెంపకందారు దగ్గరి నుంచి నూరీని తనతో పాటు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇవ్వడం వరకూ రూపొందించిన ఓ వీడియోను రాహుల్ ఈ రోజు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా తన యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement