Sunday, June 23, 2024

పుష్ప ట్రైల‌ర్ పై రామ్ గోపాల్ వ‌ర్మ .. ఏమ‌న్నారంటే ..

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం పుష్ప‌.. ఈ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ కాగా దీనిపై త‌న‌దైనశైలిలో స్పందించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. రియ‌లిస్టిక్ క్యారెక్ట‌ర్ల‌ను చేయ‌డానికి ఏ మాత్రం భ‌య‌ప‌డ‌ని ఒకే ఒక్క సూప‌ర్ స్టార్ అల్లు అర్జున్ అని కొనియాడారు. ఇలాంటి పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా అని ప్రశ్నించారు. ‘పుష్ప’ అంటే పుష్పం కాదని… అది ఫైర్ అని అన్నారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు.కాగా ఈ నెల 17న ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. ఈ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement