Tuesday, April 30, 2024

ప‌బ్ జీకి కాసుల వ‌ర్షం : ఎంత ఆదాయ‌మో తెలుసా

మొబైల్ లో ఎన్నో గేమ్స్ ఉండ‌గా ఈ గేమ్ మాత్రం విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే ప‌బ్ జీ. ఈ గేమ్ ఆడుతూ మాన‌సికంగా డిస్ట‌ర్బ్ అయి ప్రాణాలు కోల్పొయిన వారు ఉన్నారు. అయినా స‌రే ఈ గేమ్ ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది ఆడుతుండ‌టం విశేషం. అందుకే ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఆడుతున్న గేమ్ గా రికార్డుల‌ను సృష్టిస్తోంది ప‌బ్ జీ. ఇంత‌మంది ఇష్ట‌ప‌డుతున్నారంటే ఆదాయం కూడా అంత‌కంత పెరుగుతున్న‌ట్టేగా. అవును ఈ గేమ్ తో డెవ‌ల‌ప‌ర్ క్రాప్టాన్ కి కాసుల వ‌ర్షం కురుస్తుంది. మ‌రి ఈ గేమ్ ని ఆడేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 254మిలియ‌న్ డాల‌ర్లు అంటే రూ. 1.925కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట ..ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయినా ఇది నిజం.

ఈ గేమ్‌లోని ఆయుధాలు, కార్లు సహా తదితర వస్తువులు తెగ కొనుగోలు చేస్తున్నారు యూజర్లు. దీంతో పబ్‌జీ మొబైల్‌ గేమ్‌ నెల ఆదాయం 254 మిలియన్ డాలర్లకు పెరిగిందని స‌మాచారం. గత సంవత్సరం నవంబర్ ఆదాయంతో పోలిస్తే దాదాపు 46శాతం వృద్ధి కనబరిచిందట‌ పబ్‌జీ. చైనా నుంచి ప‌బ్ జీ మొబైల్ కి 66శాతం ఆదాయం వ‌చ్చింది. చైనాలో ఇది గేమ్‌ ఫర్ పీస్ పేరుతో నడుస్తోంది. ఆ తర్వాత టర్కీ నుంచి 7.3, అమెరికా నుంచి 6.8శాతం సంపాదన పబ్‌జీకి లభించింది. ఈ గణాంకాలను సెన్సార్ టవర్స్ తెలిపింది. గత సంవత్సరం పబ్‌జీ మొబైల్‌ గేమ్‌ భారత్‌లో నిషేధానికి గురైంది. ఆ తర్వాత క్రాఫ్టాన్ భారత్‌లో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా ను తీసుకురాగా దానికి మంచి ఆదరణ దక్కింది. గత నెలలో పబ్‌జీ: న్యూస్టేట్ గేమ్‌ను కూడా లాంచ్ చేసింది. మొత్తానికి ప‌బ్ జీ ద్వారా బాగానే రాబ‌ట్టారు ఆ సంస్థ‌వారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement