Sunday, April 28, 2024

మ‌హేశ్ బాబు చిత్రంలో ప‌వ‌ర్ఫుల్ రోల్ – బాల‌కృష్ణ ఓకే అంటారా

స్టార్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న నెక్ట్స్ మూవీని టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో చేయ‌నున్నాడు. కాగా మహేశ్ బాబు సినిమాలో కీలకమైన ఓ పవర్ఫుల్ రోల్ ఉందట. ఈ పాత్రను బాలకృష్ణ చేస్తే బాగుంటుందని భావించిన రాజమౌళి, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నార‌ట‌. గతంలో మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న స్నేహబంధం కారణంగా బాలకృష్ణ ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’లో ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు. మహేశ్ బాబు సినిమాలోనూ బాలకృష్ణ కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో అటు రాజమౌళితోను .. ఇటు మహేశ్ బాబుతోను కలిసి ఎంతలా సందడి చేసింది తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement