Thursday, May 16, 2024

కోడె దూడతో పొట్లగిత్త.. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

త‌మిళ‌ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పెష‌ల్ వీడియో ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బ‌నియ‌న్‌, బ్లాక్ షార్ట్​ ధరించి చెట్ల మ‌ధ్య‌లో ఉన్న వ‌న్ వే రోడ్డు వెంబ‌డి కోడెను ప‌ట్టుకుని నడుచుకుంటూ వ‌స్తూ.. అభిమానుల‌కు త‌మిళ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్‌చేస్తోంది. వెట్రిమార‌న్ డైరెక్ష‌న్‌లో జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంతో రాబోతున్న వాడివాస‌ల్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు సూర్య‌.

ఈ సినిమాలో బుల్ ఫైట్‌, కామ‌న్ మ్యాన్‌కు మధ్య రిలేష‌న్‌షిప్‌ను చూపించ‌బోతున్నాడు డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్‌. సీఎస్ చెల్ల‌ప్ప త‌మిళ పుస్త‌కం ఆధారంగా వ‌స్తోంది. మ‌రోవైపు టాలీవుడ్ స్టార్ హీరో రాంచ‌ర‌ణ్ కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌మిళ సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ హ్యాపీ న్యూ ఇయ‌ర్ అని త‌మిళ్‌లో ట్వీట్ చేశాడు రాంచ‌ర‌ణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement