Friday, May 3, 2024

తెలంగాణ ప్రభుత్వ అనుమతి తెచ్చుకొండి: ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులకు పోలీసులు సూచన

ఏపీ నుంచి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్ లను అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే తమను తెలంగాణలో కి పంపించాలని వారు పోలీసులతో వారిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లే వారికి ఏపీ పోలీసు అధికారులు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పక తీసుకోవాలని స్పష్టం చేశారు. రోగికి బెడ్ ఉందని ఆసుపత్రి అంగీకారపత్రం ఉండాలని పేర్కొన్నారు. అటు, కర్నూలు-మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వైద్య చికిత్సకు ఏపీకి వచ్చి తెలంగాణకు తిరిగి వెళ్లేవారిని పోలీసులు అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డులు పరిశీలించాకే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement