Friday, April 26, 2024

మావోల ఆధీనంలోనే రాకేశ్వర్ సింగ్: పోలీసుల నిర్ధారణ

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తమ చెరలో బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. భారీ ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ మన్‌హాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మావోయిస్టులు చెబుతున్నట్లుగా నిజంగానే అతడు వారి చెరలో ఉన్నాడా? మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు? అన్న విషయాలు తెలుసుకునేందుకు పోలీస్ ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను యాక్టివ్ చేశారు. అలాగే, ఎన్‌కౌంటర్ జరిగిన సమీప గ్రామాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించినా రాకేశ్వర్ జాడ తెలియలేదని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. దీంతో అతడు మావోయిస్టుల చెరలోనే ఉండి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు తమపైకి దాడికి వచ్చారని లేఖలో తెలిపింది మావోయిస్టు పార్టీ. మావోయిస్టులను నిర్మూలించే దుష్ట పన్నాగంతో 2000 మంది పోలీసులు తమపైకి దాడికి వచ్చారని, తమ యోధులు వీరోచితంగా పోరాడారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్‌‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్‌లు మృతి చెందినట్లు వెల్లడించింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement