Tuesday, October 8, 2024

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్’ అనే అంశంపై సోమవారం ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. ప్రధాని మోదీ డబ్ల్యూఈఎఫ్‌ను ఉద్దేశించి ఇవ్వాల ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్, చైనా అధ్యక్షుడు జి. జిన్‌పింగ్,EU కమిషన్ చీఫ్ ఉర్సువా వాన్ డెర్ లేయన్‌లతో సహా పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ ఈవెంట్‌లో అగ్రశ్రేణి పరిశ్రమ నాయకులు, అంతర్జాతీయ సంస్థల నేతలు పాల్గొంటున్నారు. వారంతా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లపై చర్చించి, వాటిని ఎలా పరిష్కరించాలో చర్చిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement