Friday, May 3, 2024

కిసాన్‌ సమ్మాన్‌ సహాయంపై ఆశలు వదులుకోవలసిందేనా?

కొత్త పట్టాదారు పాసు బుక్కులు పొందిన రైతులు పంట సహాయం కొరకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహా యంపై ఆశలు వదులుకోవలసిందేనా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువును పరిశీలిస్తే అవుననే సమాధానం దొరు కుతుంది. 2018 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించింది. 2019 జన వరి 31 గడువు పెట్టుకుని ఆ లోపు భూమి యాజమాన్యపు హక్కులు ఉన్నవారు పథకానికి అర్హులని కేంద్రం స్పష్టం చేయడంతో తిరిగి 2024 సంవత్సరం వరకు కొత్తగా రైతు ల పేర్లు నవెూదు చేసుకునే అవకాశం ఇవ్వబొమని కేంద్రం పేర్కొన్నది. దీంటో రైతుల నుంచి నిరసన వ్యక్తమై పిర్యాదులు వెళువేత్తడంతో 2020 మార్చి నెలలో మార్గదర్షాకాలను కేం ద్రం సవరించింది. వాటిని అనుసరించి భూమి యాజమా న్యపు హక్కులు మారిన సమయంలో పథకంలో చేరడానికి అవకాశం కల్పించింది.

భూమి యజమానులు చనిపోయిన యెడల వారి కుటుంబ సభ్యులకు భూమిపై హక్కులు లభిస్తే వారు పథకంలో లబ్ది పొందడానికి మార్గం సుగుమం చేసింది. కానీ పిఎం కిసాన్‌ పోర్టల్‌ లో మాత్రం 2019 జనవరి 31 తర్వాత హక్కు పత్రాలు పొందిన వారికి పథకంలో చేరడానికి అవకాశం లేదని సంబంధిత అధికారులు రైతులకు వివరిస్తున్నారు. రైతులకు ప్రతి ఏడు ఆరు వెయ్యిల రూపాయల ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం కిసాన్‌) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వెయ్యిల రూపాయల చొప్పున ఆరు వెయ్యిల రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం జామ చేస్తోంది. సిరికొండ మండలంలో ఈ పథకం క్రింద 6 వెయ్యిల 246 మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అంతవరకు బాగానే ఉన్న కొత్త రైతుల నవెూదు ప్రక్రియ నిలిచిపోవడంతో చిన్న, సన్న కారు రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా అందించే నిధులు అందడం లేదు.

కొత్త హక్కు పత్రాలు పొందిన వారికి నిరాశే…

పథకం ప్రారంభించిన సమయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల పేర్లు నవెూదు చేశారు. తర్వాత మీ సేవా కేంద్రాలలో నవెూదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీ సేవా ద్వారా రైతులు పెట్టుకున్న దరఖాస్తులు మండల వ్యవసాయ అధికారికి ఓటీపీ వస్తుంది. వ్యవసాయ అధికారి పరిశీలించి ఏవెూదిస్తే దరఖాస్తు చేసుకున్న రైతులు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి లబ్దిదారుల జాబితాలో నవెూదు అయ్యినట్లు. అంతవరకు బాగానే ఉన్న పిఎం కిసాన్‌ పోర్టల్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో గత రెండు సంవత్స రాలుగా ఒక్క రైతుకు పథకం ద్వారా లబ్ది పోందలేదు. ఈ సంవత్సరం జూన్‌10లోపు పట్టా దారులుగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అందజేస్తుంది. పిఎం కిసాన్‌ వర్తించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement