Friday, May 3, 2024

ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

దేశంలో పెట్రోల్ ధరులు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి పెట్రోల్‌ ధరలు చేరగా.. తాజాగా 35 పైసలు పెరిగింది. ఇప్ప‌టికే దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధ‌ర‌లు వంద రూపాయ‌లు దాటిపోయింది.  తాజాగా, లీట‌ర్ పెట్రోల్‌పై 35 పైసులు పెరిగింది. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం వివిధ ప్రాంతాల్లో పెట్రోల‌ట్ డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ రేటు రూ.100కు చేరువైంది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ రూ.105.24, డీజిల్‌ రూ.96.72కు చేరింది. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటింది. ఇక హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.103.05, డీజిల్ ధ‌ర రూ.97.20 కాగా విజ‌య‌వాడః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.17, డీజిల్ ధ‌ర రూ.98.73.
గుంటూరుః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.37, డీజిల్ ధ‌ర రూ.98.93.

దేశ వ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో వాహ‌న‌దారులు ఆందోళ‌నలు చేస్తున్నారు.  ధ‌ర‌లు ఇలానే పెరిగితే ప్ర‌యాణాలు చేయ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని, వాహ‌నాలు న‌డ‌ప‌లేమ‌ని అంటున్నారు.  చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో సొంత వాహ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. 

ఇది కూడా చదవండి:ఏపీకి కేంద్రం బిగ్ షాక్.. రుణపరిమితిలో ఎడాపెడా కోతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement