Sunday, April 28, 2024

Fuel prices: పెట్రో బాదుడే బాదుడు.. నేడూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 పైసలు పెంచుతూ చమరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో పెట్రోలు లీటరు 99.11 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 89,87కు ఎగసింది. హైదరాబాద్ లో లీటరు  పెట్రోల్ ధర రూ.112.37కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 98.70 కు పెరిగింది. ఇక విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.06 కాగా..లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.04గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement