Monday, April 29, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండున్నర నెలలుగా చమురు ధరలు పెరుగుతునే ఉన్నాయి. దీంతో నిత్యవసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. నిన్న లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసలు, 37 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా మరో 36 పైసలు, 26 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.98.47, డీజిల్‌ రూ.88.91కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.102.32, డీజిల్‌ రూ.96.89కి పెరిగింది.
కేవలం 55 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.8.07, డీజిల్‌పై రూ.8.38 పెరిగింది. మే 4 నుంచి ఆదివారం నాటికి అంటే 55 రోజుల్లో 31 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో దేశంలోని చాలా నగరల్లో పెట్రోల్‌ ధర రూ.100కుపైనే పలుకున్నది. డీజిల్‌ వంద రూపాయలకు చేరువలో ఉండగా, కొన్నిచోట్ల ఇప్పటికే రూ.100 దాటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement