Saturday, May 4, 2024

బ్రేక్ టైమ్ లో ‘భీమ్లా నాయక్’.. గన్​తో ఏం చేశాడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటేస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ భారీ అంచనాలు పెంచుతోంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగు శర వేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు గ్లింప్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీమ్ మరో స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. షూటింగు విరామ సమయంలో పవన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. టార్గెట్‌ను ఎయిమ్‌ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనిని ఈ సినిమా టీమ్ కెమెరాలో బంధించింది. షూటింగు విరామ సమయంలో ‘భీమ్లా నాయక్’ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.


మలయాళం సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ తీస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ హీరోయిన్లు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement