Wednesday, October 16, 2024

Sex rocket: 5 స్టార్‌ హోటల్‌లో నటీ అడ్డంగా దొరికింది..

ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూహులోని ఓ 5 స్టార్‌ హోటల్‌లో పలువురు టీవీ నటులు, మోడల్‌తో ఆమె ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కస్టమర్లుగా ఫోన్ చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు. కస్టమర్లుగా ఇషాఖాన్‌కు పోలీసులు ఫోన్‌ చేశారు. దీంతో వారితో గంటకు ఒక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసింది. ఈ  ఒప్పందం కుదరడంతో ఆమె పోలీసులకు కొంతమంది అమ్మాయిల ఫొటోలను వాట్సప్‌లో పంపించింది. ఆ తర్వాత వారిని కలుసుకోవడానికి జూహులోని ఓ స్టార్‌ హోటల్‌కు రావాల్సిందిగా ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.

 ఓ మహిళతో పాటు పలువురిని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన సదరు మహిళను టాప్‌ మోడల్‌, టీవీ నటిగా పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోవడంతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. కాగా సదరు మోడల్‌ పేరు ఇషా ఖాన్‌గా సమాచారం. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సమాచారం ప్రకారం..  జూహులోని 5 స్టార్‌ హోటల్‌లో సదరు మోడల్‌ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో  పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. అనంతరం ఈ రాకెట్‌ నడుపుతున్న ఇషాఖాన్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement