Sunday, May 5, 2024

తాగి క్లాస్ రూంలో డ్యాన్స్ వేసిన ప్రొఫెస‌ర్-విధుల నుంచి తొల‌గించిన యాజ‌మాన్యం

క్లాస్ రూంకి వ‌చ్చి విద్యార్థుల‌తో మిస్ బిహేవ్ చేశాడు ఓ ప్రొఫెస‌ర్. మ‌ద్యం తాగి చిందులేశాడు. ఈ సంఘ‌ట‌న పంజాబ్‌ పఠాన్‌కోట్‌ లోని జీఎన్​డీయూ కళాశాలలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మద్యం మత్తులో చిందులేస్తూ.. పాట పాడుతున్న ప్రొఫెసర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. మద్యంమత్తులో లోకాన్ని మరిచిన ఆ వ్యక్తి ఆ కళాశాలలో మాథ్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. తాను తన సొంత డబ్బులతో మద్యం తాగుతున్నానని,తనన్ని ఎవరూ ప్రశ్నించలేరని సదరు ప్రొఫెసర్ మాట్లాడటం వైరలవుతున్న వీడియోలో చూడవచ్చు. అంతేకాదు.. ఓ సినిమా పాటను పాడుతూ.. అందుకు తగ్గట్టుగా స్టెప్పులు కూడా వేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ కావడం వల్ల సదరు ప్రొఫెసర్ స్పందించాడు. తాను ఆ సమయంలో మద్యం తాగలేదని, తాగినట్లు నటించానని పేర్కొన్నాడు.

అదంతా సరదాగా చేసినట్లు చెప్పుకోచ్చాడు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తూ.. ఆ వీడియోను వైరల్ చేశారని ఆరోపించారు. తాను తన జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టలేదనీ, తన గురించి.. ఎవరినైనా అడగవచ్చునని అన్నారు. యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అతనిని ఉపాధ్యాయ పదవి నుండి తొలగించింది.ఈ ఘటనపై కాలేజ్ ప్రిన్సిపాల్ భూపిందర్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ.. మద్యంమత్తులో ఉన్న వ్యక్తిని తమ కాలేజీలో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రవీందర్ కుమార్ గా గుర్తించారు. తమ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన పార్ట్‌టైమ్ మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తుండనీ, బాధ్యతయుతంగా ప్రవర్తించిన ఆయనను విధులను నుంచి తొలగించినట్టు తెలిపారు.అటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇతర ప్రొఫెసర్లకు సర్క్యులర్ పంపుతామని తెలిపారు. ప్రొఫే కుమార్ వాదనలపై కౌర్ స్పందిస్తూ.. ప్రొఫెసర్ తాగి ఉండకపోయినా, క్లాస్‌రూమ్‌లో ఇలా ప్రవర్తించి ఉండకూడదని కౌర్ అన్నారు.అటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇతర ప్రొఫెసర్లకు సర్క్యులర్ పంపుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement