Friday, May 17, 2024

అఫ్గాన్ పౌరులను బహిష్కరించిన పాకిస్థాన్

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశం విడిచి వచ్చిన పౌరులను పాకిస్థాన్ బహిష్కరించింది. సుమారు 200 మందిని తిరిగి అఫ్గానిస్థాన్​కు పంపించింది. ఇకపై అక్రమంగా వచ్చే ఏ అఫ్గాన్ పౌరుడినీ దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.

అఫ్గాన్​లోని కుందుజ్ రాష్ట్రానికి చెందిన 200 మంది పౌరులు తాలిబన్లకు భయపడి వివిధ సరిహద్దు పాయింట్ల గుండా పాకిస్థాన్​లోకి వచ్చారు. కొంతకాలం ఓ రైల్వే స్టేషన్​లో తలదాచుకున్నారు. ఎక్కువ రోజులు ఉండేందుకు అధికారులు అనుమతించని నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రెండు రోజుల క్రితం వీరు క్వెట్టాకి చేరుకున్నారు. అయితే అక్కడ కూడా వారిని ఉండేందుకు అధికారులు అనుమతించలేదు. అనంతరం వారిని అఫ్గాన్​కు తిరిగి పంపించారు. మొత్తం 200 మందికి పైగా అఫ్గాన్ పౌరులు ఉండగా.. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. పాక్​లోకి అక్రమంగా ప్రవేశించినందుకు వారిని దేశ బహిష్కరణ  చేశామని క్వెట్టా డివిజన్ కమిషనర్ సోహెయిల్ ఉర్ రెహ్మాన్ బలోచ్ తెలిపారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చేంతవరకు పాక్​లోకి అక్రమంగా చొరబడే ప్రతి అఫ్గాన్ పౌరుడిని వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ఇకపై ఈజీగా సిలిండర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement