Friday, April 26, 2024

అమర్​నాథ్​కి మరో 6వేల మంది బ్యాచ్​.. 279 వాహనాల కాన్వాయ్​, సీఆర్​పీఎఫ్​ బలగాలతో ముందుకు!

అమర్​నాథ్​లో కుండపోత వానల కారణంగా యాత్రను రద్దు చేశారు. ఇప్పటికే అక్కడ వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వందలాది గుడారాలు వరదల్లో కొట్టుకుపోయాయి. బతుకుజీవుడా అనుకుంటూ చాలామంది అమర్​నాథ్​ చేరుకోకుండానే వెనుదిరుగుతుంటే.. ఇంకొంతమంది ఎట్లయినా సరే స్వామివారి దర్శనం చేసుకునే ఇంటికి వెళ్తామని మొండిగా అమర్​నాథ్​ వైపు వెళ్తున్నారు. ఇట్లా 6 వేల మందికి పైగా ఉన్న బ్యాచ్​ని  ఇవ్వాల భగవతి నగర్​ యాత్రి నివాస్​ నుంచి 279 వాహనాల కాన్వాయ్​తో 6వేల మందిని సీఆర్​పీఎఫ్​ భద్రత మధ్య పంపినట్టు అధికారులు వెల్లడించారు.

అయితే.. నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా 16 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. కాగా, 6,000 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికుల 11వ బ్యాచ్ శనివారం కాశ్మీర్‌లోని బేస్ క్యాంపనకు జమ్మూ నుండి బయలుదేరింది. 43-రోజుల యాత్ర జూన్ 30న జంట మార్గాల నుండి ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్‌, అనంత్‌నాగ్‌ పహల్గామ్‌లోని నున్వాన్ నుండి సాంప్రదాయక 48-కిమీ యాత్ర ఉంటుంది. 

ఏది ఏమైనప్పటికీ శుక్రవారం సాయంత్రం గుహ దగ్గర ఆకస్మిక వరద కారణంగా అనేక మంది ప్రజలు కొట్టుకుపోయారు. గుడారాలు, కమ్యూనిటీ కిచెన్‌లు మట్టిలో కూరుకుపోయాయి. దీంతో చాలామంది కొండపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే తీర్థయాత్ర నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

వరదల కారణంగా సంభవించిన విపత్తుపై రెస్క్యూ ఆపరేషన్స్ ముగిసిన తర్వాత యాత్ర పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు. జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి 279 వాహనాల కాన్వాయ్‌లో మొత్తం 6,048 మంది యాత్రికులు భారీ CRPF భద్రత మధ్య బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

1,404 మంది యాత్రికులు, బల్తాల్‌కు వెళుతున్నారని.. తెల్లవారుజామున 3.30 గంటలకు 115 వాహనాల్లో భగవతి నగర్ శిబిరం నుండి మొదట బయలుదేరనున్నారు. ఆ తరువాత 164 వాహనాలతో కూడిన రెండో కాన్వాయ్ 4,014 మంది యాత్రికులను పహల్గామ్‌కు తీసుకువెళ్లిందని వారు తెలిపారు. దీంతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించిన జూన్ 29 నుండి 69,535 మంది యాత్రికులు భగవతి నగర్ బేస్ క్యాంపు నుండి లోయకు బయలుదేరారు. శనివారం వరకు గుహ మందిరంలో లక్ష మందికి పైగా యాత్రికులు తమ ప్రార్థనలు చేశారని అధికారులు తెలిపారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 11న యాత్ర ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement