Tuesday, April 30, 2024

మా వడ్లు కొనాల్సిందే.. ప‌ల్లె నుంచి ప‌ట్నం దాకా ఉద్య‌మం: కేటీఆర్‌

యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉద్యమ కార్యాచరణ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో పండిన వ‌రిధాన్యం మొత్తం కొనాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తే.. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను అవ‌మానించింద‌ని, బీజేపీ స‌ర్కారు వైఖ‌రికి నిర‌స‌న‌గా పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ యాక్ష‌న్‌ప్లాన్ ప్ర‌క‌టించారు.

వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ చేప‌ట్టే ఆందోళన కార్యక్రమాలు ఏంటంటే..

01) ఈ నెల 4వ తేదీన‌ మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు..
02 6వ తేదీన‌ జాతీయ రహదారులపై రాస్తారోకో.. (నాగ్‌పూర్‌, ముంబై, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారుల‌పై),
03) 7వ తేదీన‌ జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ..
04) 8వ తేదీన గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు..
05) 11వ తేదీన‌ ఢిల్లీలో నిరసన దీక్ష చేప‌ట్టాల‌ని టీఆర్ ఎస్ పార్టీ నిర్ణ‌యించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement