Sunday, May 19, 2024

Heat waves: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

తెలంగాణలో ఎండలు దంచుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బల బారినపడే అవకాశం ఉందంటూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌ హత్నూర్‌లో 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న రాష్ట్రంలోని పలుచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా మిరాస్‌పల్లిలో అత్యధికంగా 1.3, పెబ్బేరులో 1.1, మహబూబ్‌నగర్‌లోని పర్పల్లిలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు పలు జిల్లావ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement