Friday, May 10, 2024

Hyderabad : మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. కేర్ హాస్పిటల్ కు తరలింపు

గతంలో ఎమ్మెల్యే చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శేజల్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శేజల్‌ను ఆటోలో కేర్ ఆస్పత్రికి తరలించారు.

గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఆరోపణలు చేస్తోంది. శేజల్ హ్యాండ్ బ్యాగులో నిద్రమాత్రలతో పాటు ఓ లేఖను పోలీసులు గుర్తించారు. నిద్రమాత్రలు కనిపించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement