Friday, July 26, 2024

ఎవ‌రెస్టు శిఖ‌రంపై.. అరుదైన ర‌కం అడవి పిల్లి

అత్యంత అరుదైన ర‌కం అడ‌వి పిల్లి జాతిని జంతు శాస్త్ర‌వేత్త‌లు ఎవ‌రెస్టు శిఖ‌రంపై క‌నుగొన్నారు. పల్లాస్‌ క్యాట్స్‌గా పిలిచే ఈ అడవి పిల్లుల ఉనికి ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు.. సాధారణంగా ఊర్లలో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. పల్లాస్‌ క్యాట్స్‌ కూడా అడవి పిల్లులే అయినా ఇవి ఊర్లలో పిల్లుల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. ఈ పల్లాస్‌ క్యాట్స్‌నే మనూల్‌లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను భూమిపైనే తొలిసారిగా 1776లో బైకాల్‌ సరస్సు పరిసరాల్లో పీటర్‌ సైమన్‌ పల్లాస్‌ అనే జంతుశాస్త్రవేత్త గుర్తించడంవల్ల వీటికి పల్లాస్‌ క్యాట్స్ అనే పేరు వచ్చింది. ఇవి పరిసరాలను బట్టి గ్రే, బూడిద, బూడిద ఎరుపు రంగుల్లో ఉంటాయి.

తలకు ఇరువైపుల చెవులు పొట్టిగా గుండ్రంగా ఉంటాయి. తోక 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది. కాళ్లు పొట్టిగా ఉంటాయి. వీటి శరీరంపై పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. అయితే, వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు రెండింతలు ఎక్కువ పొడవుతో ఉంటాయి. ఎందుకంటే చల్లటి ప్రదేశాల్లో నివసించే ఈ పిల్లులను చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి. ఇవి ఎక్కువగా హిమాలయాలు, టిబెట్‌ పీఠభూమి, ఇరానియన్‌ పీఠభూమి, దక్షిణ సైబీరియన్‌ కొండలు తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement