Thursday, April 25, 2024

India | మొఘల్​ గార్డెన్స్​ పేరు మార్చిన కేంద్రం.. అమ్రిత్​ ఉద్యాన్​ని​ రేపు ప్రారంభించనున్న రాష్ట్రపతి

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల (శనివారం) ‘అమృత్ ఉద్యాన్’గా మార్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ థీమ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చినట్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా మాట్లాడుతూ.. ’75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ కు రాష్ట్రపతి భవన్‌కు అమృత్ ఉద్యాన్​’’ అని పేరు పెట్టారని తెలిపారు.

ఇక.. ఈ అమృత్ ఉద్యాన్​ని రేపు (జనవరి 29, ఆదివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రారంభించనున్నారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు దాదాపు రెండు నెలల పాటు సందర్శకుల కోసం ఇది ఓపెన్​ చేసి ఉంచుతారు. సాధారణంగా గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు ఓపెన్​లో ఉంటుంది. -ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ గార్డెన్​లో పలు రకాల పూలు-సంపూర్ణంగా వికసించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చూసే అవకాశం కల్పించేవారు. 

ఇక.. ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచిన ఈ రెండు నెలల కాలంతో పాటు, రైతులు, వికలాంగుల వంటి ప్రత్యేక బృందాలు కూడా గార్డెన్‌ను చూసేందుకు ఇకమీదట అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వం యోచిస్తోందని నవికా గుప్తా తెలిపారు. మొఘల్ గార్డెన్స్ సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక నెల ప్రజల సందర్శనార్థం ఓపెన్​ చేసి ఉంటుంది.. కాగా, ఇందులో దీర్ఘచతురస్రాకార, పొడవైన, వృత్తాకార ఉద్యానవనాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక్కడ హెర్బల్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, స్పిరిచ్యువల్ గార్డెన్ వంటివి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement